Chorus
మరణానికే ఓఓఓ - ఎదురెళ్ళినా ఆఆఆ
మహనీయుడు నాయేసయ్యా -‖ 2x ‖
ఆయనే నాదైవం - ఆయనే నా ప్రాణం -‖ 2x ‖
Verse
శోధించె అపవాది యేసయ్యనూ
ఎదిరించి పోరాడే బలవంతుడై -‖ శోధించె 2x ‖
ఆయేసు నామములో ఓ
బలమొందు ఓసోదరా నేడూ
ఆయేసు నామములో బలమొందు ఓ సోదరీ
Verse
పాపాలకధిపతి అపవాదిపై
జయమొందె యేసయ్య ఆసిలువపై -‖ పాపాల 2x ‖
ఆయేసునామములో ఓ
జయమొందు ఓ సోదరా నేడూ
ఆయేసునామములో జయమొందు ఓ సోదరీ
Verse
పరలోకమే నీగమ్యమై
ప్రభువాక్యమే నీప్రాణమై -‖ పరలోకమే 2x ‖
ప్రకటించు ఓ సోదరా నేడూ
ఆయేసునామమునూ ప్రకటించు ఓ సోదరీ