Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mariyaa Tanayudai Manujaavathaarudai

మరియా తనయుడై మనుజావతారుడై

Mariyaa Tanayudai Manujaavathaarudai

Lyricist: Suresh Nittala
Verse
మరియా తనయుడై – మనుజావతారుడై
మహిలోన వెలసెను – మనకొరకై జన్మించెను
“ఆనందమానందమే – లోకానికి శుభదినమే
ఆనందమానందమే – సర్వసృష్టికి సంతోషమే”
Verse
ఒక దూత తెలిపెను – గొల్లలకు శుభవార్తను
ఒక తార వెలిసెను – రారాజుని ప్రకటించెను
Verse
బెత్లెహేము పురములో – దావీదు వంశంబులో
రక్షకుడు వెలసెను – మన పాపము తొలగించెను
Verse
రాజులకే రాజుగా – ప్రభువులకే ప్రభువుగా
ఇమ్మానుయేలుగ – యేసయ్య జన్మించెగ

Related Tags

WorshipChristmasNativity