Verse
మరియకు సుతుడుగ ధరను జన్మించి
ఇమ్మానుయేలాయెన్
Verse
నిరుపేదగాను పశువుల పాకలో
తేజోమయ ప్రభు భువుని శిశువుగ బుట్టెను
Verse
పాపసంకటము పోగొట్ట ధరను - ప్రాపకుడు నరునిగ బేత్లెహేమున
పాపపరిహారుడు నరుల మిత్రుడు - అవనిలో జన్మించెన్
Verse
ఆకాశచుక్క భాసిల్లుచుండ - వీకతో దీనోపకారుడు వెలసెన్
హీన సైతానుడు కూలిపోవగన్ - ప్రియముతో ఉదయించెన్
Verse
దూత గణములు గీతముల్ పాడ - క్షితిలో నరులు మంగళము పాడ
కన్య మరియమ్మ పాడెను లాలి - పుణ్యుడు జన్మించగా