Verse
మరువద్దు మరువద్దు
తండ్రి ప్రేమ మరువద్దు
జీవితాన్ని వ్యర్ధించకుమా
విడువద్దు విడువద్దు
ప్రేమ బంధం విడువద్దు
నీదు స్థానం మరువద్దుమా
తిరిగి రావా తిరిగి రావా
తిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా‖ మరువద్దు ‖
Verse
నీకై నీతో జీవాన్ని పంచిన
నీలా నీతో స్నేహించిన‖ 2x ‖
కాచెను కనురెప్పలా
కాపాడెన్ దైవముగా‖ 2x ‖
ఆ ప్రేమే నిన్ను పిలిచే‖ మరువద్దు ‖
Verse
లోకం స్నేహం సుఖ భోగ పాపాలు
అంతా మలినం మిగిలిందిగా‖ 2x ‖
ఆలస్యం చేయకుమా
వేగమే పరుగెత్తుమా‖ 2x ‖
నీ తండ్రి వేచియుండే‖ మరువద్దు ‖