Verse
మరువలేను – మరువలేను – మరువలేనయ్యా‖ 2x ‖
నీ ప్రేమ చరితం.. ఆ ఘోర మరణం‖ 2x ‖
మరువలేనయ్యా.. మరువలేనయ్యా…
యేసయ్యా.. యేసయ్యా – యేసయ్యా.. దయామయా‖ 2x ‖
ఓ ఓ ఓ…. మరువలేనయ్యా.. మరువలేనయ్యా…
Verse
బలి పశువుగ నా పాపము కొరకై
బలియై పోతివయ్యా‖ 2x ‖
నోరు తెరువక భారపు సిలువను
భరియించి ఓర్చితివా
నాకై భారము మోసితివా‖ యేసయ్యా ‖
Verse
పంచ గాయములలో కారుచున్న రుధిరం
నిను ముంచి వేసెనయ్యా‖ 2x ‖
దోష రహితుడా హేతువు లేక
నిను ద్వేషించిరయ్యా
పగబట్టి చంపిరయ్యా‖ యేసయ్యా ‖
Verse
ఏ దారి గానక – తిరిగిన నన్ను
నీ దరి చేర్చితివే‖ 2x ‖
మార్గము నీవై సత్యము నీవై
జీవము నీవైతివే
నా సర్వము నీవైతివే‖ యేసయ్యా ‖