Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mattinaina Nannu

మట్టినైన నన్ను

Mattinaina Nannu

Lyricist: P Kishore Kumar
Verse
మట్టినైన నన్ను మనిషిగా మార్చి
జీవ వాయువునూది జీవితాన్ని ఇచ్చావు‖ 2x ‖
ఎంత పాడినా – ఎంత పొగిడినా
ఎంత ఘనపరచినా – ఎంత కీర్తించినా
నీ ఋణమును నేను తీర్చలేనయ్యా
నా యేసురాజా నా దైవమా‖ 2x ‖
Verse
నలిగినా వారికి ఆపత్కాలమున – దుర్గము నీవే
నీ శరణుజొచ్చిన జనులందరికి – రక్షణ నీవే‖ 2x ‖
నీ ధర్మశాస్త్రము యధార్థమైనది‖ 2x ‖
అది మా ప్రాణముల తెప్పరిల్లజేయును‖ 2x ఎంత పాడినా ‖
Verse
అలసిన వారికి ఆశ్రయపురము – కేడెము నీవే
కృంగిన వారిని కృపతో బలపరిచే – జీవము నీవే‖ 2x ‖
నీ సిలువ మరణము ఘోరాతి ఘోరం‖ 2x ‖
విశ్వ మానవాళికి పాపవిమోచన‖ 2x ఎంత పాడినా ‖

Related Tags

PraiseWorshipThanksgiving