Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mattiviraa Vattiviraa Manuvuraa Mannavuraa

మట్టివిరా వట్టివిరా మనువురా మన్నవురా

Mattiviraa Vattiviraa Manuvuraa Mannavuraa

Chorus
మట్టివిరా వట్టివిరా మనువురా మన్నవురా
కాయము మూయము ఖాయమురా అయ్యయ్యో‖ 2x ‖
Verse
అటుచేసి ఇటుచేసి అందరిని మోసం చేసి
సంఘాన్ని రెండుగ చీల్చావే అయ్యయ్యో
నీ గోతిలో నువ్వే పడ్డావే అయ్యయ్యో
Verse
నువ్వేసిన వేషాలు నువు చేసిన మోసాలు
నరకాగ్నికి నిను చేర్చునులే అయ్యయ్యో
నరకాగ్నిలో కాలిపోదువులే అయ్యయ్యో
Verse
నీ బ్రతుకుదెరువుకోసం బైబిల్ను చేతబట్టి
పరమార్థం మర్చిపోయావే అయ్యయ్యో
ఆత్యలతో ఆడుకొన్నావే అయ్యయ్యయ్యో
Verse
సువార్త సేవకోసం పంపిన సొమ్ములన్నీ
సొంతానికి ఖర్చు చేశావే అయ్యయ్యో
శాపాన్ని తెచ్చుకున్నావే అయ్యయ్యో
Verse
పాపాన్ని పాతిపెట్టి దోషాన్ని దాచిపెట్టి
దొరలాగ తిరుగుచున్నావే అయ్యయ్యో
తొందరలో దొరికిపోతావే అయ్యయ్యో
Verse
నీ పాపం ఒప్పుకుంటే ఆ పాపం విడిచిపెడితే
పరలోకం నిన్ను చేర్చునులే యేసయ్యా
నీ పాపం కడిగివేయునులే మెస్సయ్యా

Related Tags

GospelRepentanceWarning