Verse
యేసువా.. యేసువా..
యేసువా నా యేసువా‖ 2x ‖
మీ జ్ఞాపకార్థముగా భుజించుచున్నాము
మీ దివ్య దేహమును
తమ ఆజ్ఞానుసారముగా పానము చేసెదము
మీ తీరు రుధిరమును‖ యేసువా ‖
Verse
ఆనాడు మీ దేహమును హింసించి చంపితిమి‖ 2x ‖
ఈనాడు ఆ దేహమే మేము గాచుచుండెనుగా‖ 2x ‖
మేము గాచుచుండెనుగా‖ యేసువా ‖
Verse
ఆనాడు మీ రక్తమును చిందింప చేసితిమి‖ 2x ‖
ఈనాడు ఆ రక్తమే మేము శుద్ధి పరచెనుగా‖ 2x ‖
మేము శుద్ధి పరచెనుగా‖ యేసువా ‖
Verse
మా పాప భారమును సిలువగ మోసితివి‖ 2x ‖
మార్గము చూపితివి రక్షణ నొసగితివి‖ 2x ‖
రక్షణ నొసగితివి‖ యేసువా ‖