Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Meeru Bahugaa Phalinchinacho

మీరు బహుగా ఫలించినచో

Meeru Bahugaa Phalinchinacho

Verse
మీరు బహుగా ఫలించినచో
మహిమ కలుగును తండ్రికి
ఈ రీతిగా ఫలించినచో
శిష్యులై యుండెదరు‖ 2x ‖
Verse
నీరు కట్టిన తోటవలె
నీటి వూటవలె నుండెదరు‖ 2x ‖
క్షామములో తృప్తి నిచ్చి
క్షేమముగా మిమ్ము నడిపించును‖ 2x ‖
బలపరచును మీ యెముకలను‖ 2x ‖
అధికముగా ఫలించుడి‖ 2x మీరు ‖
Verse
చెట్లులేని మెట్టలలో
నదుల ప్రవహింపజేయు ప్రభువు‖ 2x ‖
ఎండియున్న నేలనెల్ల
నీటిబుగ్గలుగా జేయువాడు‖ 2x ‖
మన ప్రభువైన యేసునందు‖ 2x ‖
అధికముగా ఫలించుడి‖ 2x మీరు ‖
Verse
వడిగా ప్రవహించు నదిని బోలి
విస్తరింపజేయు తన శాంతిని‖ 2x ‖
ఐశ్వర్యముతో నింపు మిమ్ము
ముదిమివరకు మిమ్ము మోయువాడు‖ 2x ‖
మన ప్రభువైన యేసునందు‖ 2x ‖
అధికముగా ఫలించుడి‖ 2x మీరు ‖
Verse
పాడెదరు మూగవారు
గంతులు వేసేదరు కుంటివారు‖ 2x ‖
పొగడెదరు ప్రజలెల్లరు
ప్రభుని ఆశ్చర్య కార్యములను‖ 2x ‖
మహిమ ఘనత చెల్లించుచు‖ 2x ‖
హల్లెలూయ పాడెదరు‖ 2x ‖
అధికముగా ఫలించుడి‖ 2x మీరు ‖

Related Tags

EncouragementBlessingFruitfulness