Chorus
మీరు బహుగా ఫలించినచో - మహిమ కలుగును తండ్రికి
ఈ రీతిగా ఫలించినతో శిష్యులై యుండెదరు
Verse
నీరు కట్టిన తోటవలె నీటి వూటవలె నుండెదరు
క్షామములో తృప్తి నిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును
బలపరచును మీ యెముకలను అధికముగా ఫలించుడి
Verse
చెట్లులేని మెట్టలలో నదుల ప్రవహింపజేయు ప్రభువు
ఎండియున్న నేలనెల్ల నీటిబుగ్గలుగా జేయువాడు
మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి
Verse
వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తనశాంతిని
ఐశ్వర్యముతో నొంపు మిమ్ము ముదిమివరకు మిమ్ము మోయువాడు
మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి
Verse
పాడేదరు మూగవారు గంతులు వేసెదరు కుంటివారు
పొగడేదరు ప్రజలెల్లరు ప్రభుని ఆశ్చర్య కార్యములను
మహిమ ఘనత చెల్లించుచు హల్లెలూయ పాడెదరు