Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Meghaala Paina Mana Yesu

మేఘాల పైన మన యేసు

Meghaala Paina Mana Yesu

Lyricist: Sharon Philip
Verse
మేఘాల పైన మన యేసు
త్వరలోనే మనకై వచ్చుచున్నాడు‖ 2x ‖
సిద్ధపడుమా ఉల్లసించుమా
నీ ప్రియుని రాకకై‖ 2x మేఘాల ‖
Verse
ఏ ఘడియో ఏ వేళయో – తెలియదు మనకు
బుద్ధి కలిగిన కన్యకలు వలె – సిద్ధపడియుండు‖ 2x ‖
బూర శబ్దం మ్రోగగా
ప్రభుని రాకడ వచ్చును
రెప్ప పాటున పరిశుద్ధులు
కొనిపోబడుదురు ప్రభువుతో‖ మేఘాల ‖
Verse
పాపం వలన వచ్ఛు జీతం – మరణమే కాదా
దేవుని కృపయే క్రీస్తు యేసులో – నిత్య జీవమే‖ 2x ‖
వినుట వలన విశ్వాసం
కలుగును సోదరా
దేవుని ఆజ్ఞకు లోబడితే
పొందెదవు పరలోకం‖ మేఘాల ‖
Verse
స్తుతియు మహిమ ఘనత ప్రభావం
యేసుకే చెల్లు గాక
తర తరములకు యుగయుగములు
యేసే మారని దైవం‖ 2x ‖
నిత్యము ఆనందమే ప్రభువా నీతో నుండుట
నూతన యెరూషలేము చేరుకోనుటే నిరీక్షణ‖ మేఘాల ‖

Related Tags

Second ComingRaptureEnd Times