Verse
మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని
నడిపించే సన్నిధిని నను వీడి పోనివ్వకు
Verse
బలహీనుడు బలవంతుడవునే
నీ సన్నిధి వచ్చుటచే
ఏమి లేకపోయినా నిండుగా ఉండెదన్
నీ సన్నిధిలో నేను
Chorus
నీ సన్నిధియే నాకు చాలయా నా హృదివాంఛ నీవెనయా
Verse
మన్నాను పక్షులను నీటిని అందించావు అన్నియు అధికముగా ఉన్నవి
అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును
నీవు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో
నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో
Chorus
నీ సన్నిధియే నాకు చాలయా నా హృదివాంఛ నీవెనయా
Verse
ఈ లోక అధికారం రాజ కిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను
అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును
నువ్వు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో
నీవు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో