Verse
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా
చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా‖ 2x ‖
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను‖ 2x ‖
నిత్యము నీ కీర్తి నా నోట నుండును‖ 2x మేలైనా ‖
Verse
కలిమి చేజారి నను ముంచినా
స్థితిని తలక్రిందులే చేసినా‖ 2x ‖
రెండింతలుగా దయచేసెదవని‖ 2x ‖
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా‖ 2x మేలైనా ‖
Verse
పరుల ఎగతాళి శృతి మించినా
కలవరము పొంది నే కృంగినా‖ 2x ‖
నా మొర విని కృప చూపెదవని‖ 2x ‖
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా‖ 2x మేలైనా ‖
Verse
శ్రమలు చెలరేగి బెదిరించినా
ఎముకలకు చేటునే తెచ్చినా‖ 2x ‖
ఆపదలలో విడిపించెదవని‖ 2x ‖
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా‖ 2x మేలైనా ‖