Verse 1
Reference: కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి మత్తయి Matthew 24:42
Chorus
మేల్కొనుమా మేల్కొనుమా
యేసే నుడివెను ఓ ప్రియుడా మేల్కొనుమా మేల్కొనుమా
Verse
తెలిసికొనుము వివేచించి విభుని యొక్క చిత్తంబేమో
కాలవిలువను యెరిగి మేల్కొనుమా
Verse
నమ్మజాల మీ లోకమును నీ జీవమేపాటిది
సమస్తంబు వ్యర్థంబేగా ప్రార్థించుమా
Verse
తప్పుడు బోధలనుండి భద్రపరచు కొనుము నీవు
ఎప్పుడు ప్రభు యిష్టమును నెరవేర్చుమా
Verse
ఆవేశము వ్యర్థంబేగా ప్రవర్తింపకు డంబముగా
అహంకార గర్వమునుండి తప్పించుకో
Verse
యేసు శీఘ్రముగావచ్చు యెదురు చూడవలెను నీవు
భాసురముగా తనతో వెళ్ళ సిద్ధపడుమా