Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Melu Cheyaka Neevu Undalevayyaa

మేలు చేయక నీవు ఉండలేవయ్యా

Melu Cheyaka Neevu Undalevayyaa

Lyricist: Nycil Kk
Verse
మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా‖ 2x ‖
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా‖ 2x మేలు చేయక ‖
Verse
నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక‖ 2x ‖
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా‖ 2x ‖
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది‖ యేసయ్యా ‖
Verse
ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే‖ 2x ‖
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్‖ 2x ‖
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి‖ యేసయ్యా ‖
Verse
పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో‖ 2x ‖
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని‖ 2x ‖
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు‖ యేసయ్యా ‖

Related Tags

WorshipThanksgiving