Verse
మేలుకో! మహిమ రాజు
వేగమే రానై యున్నాడు‖ 2x ‖
Verse
పరమునుండి – బూర ధ్వనితో
అరయు నేసు – ఆర్భాటముతో‖ 2x ‖
సర్వలోకము – తేరిచూచును
త్వరపడు ఓ ప్రియుండా‖ 2x మేలుకో ‖
Verse
గురుతులెల్ల – ధరణియందు
సరిగ చూడ – జరుగుచుండ‖ 2x ‖
చిరునవ్వుతో – చేరి ప్రభుని
త్వరపడు ఓ ప్రియుండా‖ 2x మేలుకో ‖
Verse
క్రీస్తునందు – మృతులెల్లరు
కడబూర – మ్రోగగానే‖ 2x ‖
క్రీస్తువలె – తిరిగి లేతురు
లేతువా? నీవు ప్రియుడా‖ 2x మేలుకో ‖
Verse
అరయంగ – పరిశుద్ధులు
మురిసెదరు – అక్షయ దేహులై‖ 2x ‖
పరమందు – ప్రభుక్రీస్తు
నిరతము – ఓ ప్రియుండా‖ 2x మేలుకో ‖
Verse
కరుణలేని – ఓ మరణమా
నిరతము నీకు జయమగునా‖ 2x ‖
మరణ సంహా – రుండేసు
త్వరగా – రానై యున్నాడు‖ 2x మేలుకో ‖
Verse
మాంసలోక – పిశాచాదులు
హింస పరచ – విజృంభించిన‖ 2x ‖
లేశమైనను – జడియకుము
ఆశతో – కాచుకొనుము‖ 2x మేలుకో ‖
Verse
పాపమును – చేయకుమా
రేపకుమా – దైవ కోపమును‖ 2x ‖
శాపమును – తప్పుకొని
శ్రద్ధతో – కాచుకొనుమా‖ 2x మేలుకో ‖