Chorus
మేలుకో! మహిమ రాజు వేగమే రానై యున్నాడు
Verse
పరమునుండి - బూర ధ్వనితో అరయు నేసు - ఆర్భాటముతో
సర్వలోకము - తేరిచూచును త్వరపడు ఓ ప్రియుండా
Verse
గురుతులెల్ల - ధరణియందు సరిగ చూడ - జరుగుచుండ
చిరునవ్వుతో - చేరి ప్రభుని త్వరపడు ఓ ప్రియుండా
Verse
క్రీస్తునందు - మృతులెల్లరు కడబూర - మ్రోగగానే
క్రీస్తువలె - తిరిగి లేతురు - లేతువా? నీవు ప్రియుడా
Verse
అరయంగ - పరిశుద్ధులు మురిసెదరు - అక్షయ దేహులై
పరమందు - ప్రభుక్రీస్తు నిరతము - ఓ ప్రియుండా
Verse
కరుణలేని - ఓ మరణమా నిరతము నీకు జయమగునా
మరణ సంహా - రుండేసు త్వరగా - రానై యున్నాడు
Verse
మాంసలోక - పిశాచాదులు హింస పరచ - విజృంభించిన
లేశమైనను - జడియకుము ఆశతో - కాచుకొనుము
Verse
పాపమును - చేయకుమా రేపకుమా - దైవ కోపమును
శాపమును - తప్పుకొని శ్రద్ధతో - కాచుకొనుమా