Verse
మేలుకో విశ్వాసి మేలుకో
చూచుకో నీ స్థితిని కాచుకో‖ 2x ‖
మేలుకో విశ్వాసి మేలుకో
ఇది అంత్య కాలం.. భ్రష్టత్వ కాలం‖ 2x ‖
ఇహ లోక మాలిన్యం దూరపరచుకో
మదిలోని మురికినంత కడిగివేసికో‖ మేలుకో ‖
Verse
నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్త
మంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త‖ 2x ‖
విశ్వాసం లేని దుష్ట హృదయము
చేదు వేరు నీవేనేమో చూడు జాగ్రత్త‖ మేలుకో ‖
Verse
ప్రేమ లేక పరిశుద్ధత కలుగునా
ధర్మశాస్త్ర సారమే ప్రేమ కదా‖ 2x ‖
ప్రేమ లేక ద్వేషింప బూనితే
క్రీస్తు ప్రేమ సిలువలో వ్యర్ధమే కదా‖ మేలుకో ‖