Verse
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా‖ 2x ‖
నా ప్రాణమున్నంత వరకు
విడచిపోలేనయ్యా‖ మేలులు ‖
Verse
కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా
శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా‖ 2x ‖
నీది గొర్రెపిల్ల మనస్సయ్యా
యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా‖ 3x ‖
Verse
అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా
జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా‖ 2x ‖
నీది పావురము మనస్సయ్యా
యేసయ్యా.. పావురము మనస్సయ్యా‖ 3x ‖
Verse
చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా
దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా‖ 2x ‖
నీది ప్రేమించే మనస్సయ్యా
యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా‖ 3x ‖