Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mem Kraisthavulam

మేం క్రైస్తవులం

Mem Kraisthavulam

Lyricist: Swapna Edwards
Verse
ప్రేమ క్షమలను సమపాళ్లుగా
విశ్వాసమే లక్ష్యంగా
మా జీవితాలనే సాక్ష్యంగా
నిజదేవుని జనాంగంగా‖ 2x ‖
పిలువబడిన వారమే మేము
సిగ్గుపడని వారమే మేము‖ 2x ‖
మేం క్రైస్తవులం క్రీస్తనుచరులం
మేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలం
మేం క్రైస్తవులం పరలోక దీపికలం
మేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులం
మేం క్రైస్తవులం క్రైస్తవులం
మేం క్రైస్తవులం క్రైస్తవులం
Verse
మతానికి అతీతులం
జాతి వర్ణ వర్గాలనేకం
మేం యేసు రక్తంతో కొనబడిన వారం
మేం సత్యమార్గంలో నడిచే వారం‖ 2x ‖
యేసు నీ జీవితమే మాకు పాఠంగా
మా బ్రతుకులకే ఒక యాగంగా
చేసుకొన్న వారమే మేము
ఏక శరీరమై ఉన్నాము‖ 2x ప్రేమ ‖
Verse
మనుష్యులను ప్రేమిస్తాము
దైవ ప్రేమనే ప్రకటిస్తాము
ఏ శోధనకైనా తలవంచని వారం
దేవుని చెంత మోకరించే వారం‖ 2x ‖
లోకం మమ్ములను వేధిస్తున్నా
చులకనగా చూసి నిందిస్తున్నా
బాధను సహించే వారం
మేం శత్రువునైనా క్షమిస్తాము‖ 2x ‖
Verse
పాపం అంటే శరీరంతో చేసేదే కాదు
మనసులో తలంచేది అంటాం
ఎందుకంటే మేం క్రైస్తవులం
Verse
ఏ మనిషి దేవుని రూపాన్ని చూడలేదు
అందుకే విగ్రహారాధన మేం చెయ్యం
ఎందుకంటే మేం క్రైస్తవులం
Verse
దేవుడంటే సృష్టిని చేసిన వాడు
ఆ దేవునికి విదేశీ దేవుడనే మాటే లేదంటాం
ఎందుకంటే మేం క్రైస్తవులం
Verse
ఎన్ని బాధలు పెట్టి హింసించినా
ప్రేమతో క్షమిస్తాము
ఎందుకంటే మేం క్రైస్తవులం‖ ప్రేమ ‖

Related Tags

PraiseCommitmentChristian Identity