Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Memichu Kaanukal Neeve Maakichu

మేమిచ్చు కానుకల్ నీవే మాకిచ్చ

Memichu Kaanukal Neeve Maakichu

Lyricist: William Walsham How
Verse
మేమిచ్చు కానుకల్
నీవే మాకిచ్చితి
మా యాస్తియంత ప్రభువా
నీ దానమే గదా.
Verse
నీ వుచితంబుగా
మా కిచ్చువాడవు
అన్యుల కుచితంబుగా
మేమిచ్చుచుందుము.
Verse
సర్వత్ర బీదలు
అన్నంబునొందరు
కన్నీళ్లు రాల్చు ప్రజలు
అనేకులుందురు.
Verse
ఈలాటివారికి
సహాయమిచ్చుట
దూతలు చేయు సేవకు
సమానమగును.
Verse
పోషించి బీదలన్
రక్షించి పాపులన్
అందరిన్ సంరంక్షించుట
శ్రీ యేసు కార్యమే.
Verse
నా బీదవారికి
నీవిచ్చు దానము
నా కిత్తువను వాక్యము
శ్రీ యేసు చెప్పెను.

Related Tags

OfferingStewardshipGiving