Verse
మేము భయపడము – ఇక మేము భయపడము
ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు‖ 2x మేము ‖
Verse
దైవ భ్రష్టులమైన మమ్ము
దివ్యంపుగా రక్షించే‖ 2x ‖
దీవారాత్రులు దేవుడే కాయును‖ మేము ‖
Verse
శత్రు కోటి మమ్ము జుట్టన్
పాతాళము మ్రింగ జూడన్‖ 2x ‖
నిత్యుడు యేసు నిత్యము కాయును‖ మేము ‖
Verse
అగ్ని పరీక్షల యందు
వాగ్ధానమిచ్చె మాతో నుండ‖ 2x ‖
ఏ ఘడియైనను విడువక కాయును‖ మేము ‖
Verse
బలమైన ప్రభు హస్తములు
వలయము వలె మమ్ము జుట్టి‖ 2x ‖
పలు విధములుగా కాపాడు మమ్ము‖ మేము ‖
Verse
కునుకడు మన దేవుడు
యెన్నడు నిద్రించడు‖ 2x ‖
కను పాపగా మము కాపాడునెప్పుడు‖ మేము ‖
Verse
జీవిత కష్ట నష్టములు
ఆవరించి దుఃఖపరచ‖ 2x ‖
దేవుడొసంగిన ఈవుల నెంచుచు‖ మేము ‖
Verse
ఇహమందు మన శ్రమలన్ని
మహిమకు మార్చెడు ప్రభున్‖ 2x ‖
మహిమపరచి మ్రొక్కెదములలో‖ మేము ‖