Verse
మేము భయపడము ఇక మేము భయపడము
ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు
Verse
దైవభష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించె
దివారాత్రులు దేవుడే కాయును
Verse
శత్రుకోటి మమ్ము జుట్టన్ పాతాళము మ్రింగ జూడన్
నిత్యుడు యేసు నిత్యము కాయును
Verse
అగ్ని పరీక్షల యందు వాగ్దానమిచ్చె మాతోనుండ
యే ఘడియైనను విడువక కాయును
Verse
బలమైన ప్రభు హస్తములు వలయమువలె మమ్ము జుట్టి
పలువిధములుగా కాపాడుమమ్ము
Verse
కునుకడు మనదేవుడు యెన్నడు నిద్రించడు
కనుపాపగ మము కాపాడునెప్పుడు
Verse
జీవిత కష్టనష్టములు ఆవరించి దుఃఖపరచ
దేవుడొసంగిన ఈవుల నెంచుచు
Verse
ఇహమందు మన శ్రమలన్ని మహిమకు మార్చెడు ప్రభున్
మహిమపరచి మ్రొక్కెదమిలలో