Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Memu Vellichoochinaamu Svaami Yesa

మేము వెళ్లిచూచినాము స్వామి యేస

Memu Vellichoochinaamu Svaami Yesa

Chorus
మేము వెళ్లిచూచినాము స్వామి యేసుక్రీస్తును ప్రేమ మ్రొక్కి వచ్చినాము
మా మనంబులలరగ‖ మేము ‖
Verse
బేదలేము పురములోన బీద కన్యమరియకుఁ బేదగా సురూపుఁ దాల్చి
వెలసెఁ బశులపాకలో‖ మేము ‖
Verse
జ్ఞానులమని గర్వపడక దీనులమై నిత్యము వాని ప్రేమ సకల ప్రజకు
మానక ప్రకటింతుము‖ మేము ‖
Verse
తద్దరిశనమందు మాకుఁ బెద్ద మేలు గలిగెగా హద్దులేని పాపమంత
రద్దుపరచబడెనుగా‖ మేము ‖
Verse
మరణమెపుడొ రేపొమాపో మరియెపుడో మన మెరుగము త్వరగా
పోయి పరమగురుని దరిశనంబుఁ జేతము‖ మేము ‖
Verse
హరిశుద్ధాత్మ జన్మ మాకు వరముగా నొసంగెను పరమపురము మాకు
హక్కు పంచెదాను నిరతము‖ మేము ‖
Verse
మాకు సర్వగర్వమణిగి మంచి మార్గమబ్బెను మాకు నీ సువార్తఁ జెప్ప
మక్కువెంతోఁ గలిగెను‖ మేము ‖

Related Tags

WorshipChristmas