Verse
మెరిసే నింగిలో మెరిసే ఓ తార
కురిసే మహిమలే కురిసే ఈవేళ
ధర ఎంతో పులకించే నీ స్పర్శతో
దివిలోక పరిమళమే భువి చేరగా
Chorus
పాడంగా దూతల్ పాడంగా
ఆడంగా గొల్లలు ఆడంగా
పాడంగా జ్ఞానులు పాడంగా
జగమంతా సంబరమాయెనే
Verse
దివినేలే ఆరాజు దీనుడై భువికొచ్చే
దివ్యాత్మ బలుడైనా బాలుడై పవళించే
ఆ మరియ గర్భానా ఆ..ఆ..ఓయ్
ఆ మరియ ఒడిలోన ముసి ముసి నవ్వాడే
మన దుఃఖ బ్రతుకుల్లో చిరునవ్వు వచ్చునులే
ఉదయించి ఆ తార ఆరాజు రాక తెలిపే
దూరాన ఉన్నోళ్లను ఆ రాజు దరిని చేర్చే
మారాలి మనమిలలో ఓ… ఓ.. ఓయ్
మారాలి మనమిలలో యేసయ్య తారలుగా
రావాలి జగమంతా మనద్వారా ప్రభు దరికి