Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Meriseti taaralaa nanu veliginchu

మెరిసేటి తారలా నను వెలిగించు

Meriseti taaralaa nanu veliginchu

Lyricist: Joshua Shaik, Deva Prasad
Chorus
మెరిసేటి తారలా నను వెలిగించు
కురిసేటి జల్లులా నను దీవించు
నా ఊపిరివై నా జీవితమై
నా ఊపిరివై నా జీవితమై
నా ప్రాణ స్నేహమై నా రక్షకుడై
Verse
నీ కనులే నా మనసే తేరిచూడగా
నాలోనా ఏ మంచి కానరాదుగా
నీ కృపలో నా గతమే చూడలేదుగా
సరిచేసి నడిపించు నీదు సాక్షిగా
నీతి సూర్యుడా, నాదు యేసయ్య
జీవితాంతము, జాలి చూపవా
నా ప్రాణ స్నేహమై – నా రక్షకుడై
Verse
నీ మమతే తీయనిదీ మారదెన్నడు
లాలించే నీ ప్రేమ వీడదెన్నడు
ఊహలకే అందనిది నీదు కార్యము
నీ మాటే నాలోన నిండు ధైర్యము
సర్వశక్తుడా నాదు యేసయ్య
ఆశ్రయించగా ఆదరించవా
నా ప్రాణ స్నేహమై – నా రక్షకుడై