Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Minnayaina Prema Chupina Yesayya

మిన్నయైన ప్రేమ చూపిన యేసయ్యా

Minnayaina Prema Chupina Yesayya

Lyricist: Prabhod Kumar Adusumilli
Verse
మిన్నయైన ప్రేమ చూపిన యేసయ్యా
ఎన్నడైన భూమి చూడని మనసయ్యా
ఎంతగానో ఓర్చితివే వింతగా క్షమించితివే
మిన్నకుండలేము యేసయ్యా కనుగొని నీ ప్రేమను
ఎన్న తరమే కాదయ్యా లోతైన ఆ ప్రేమను
Verse
ద్రోహము చేసి దోషము మోపిరి
కేకలు వేసి సిలువకు నెట్టిరి
పండ్లు కొరికి చెంపలు పెరికిరి
ముండ్లను గుచ్చి మోమున ఉమ్మిరి
శ్రమ పెట్టిన కొలది క్షమ పుట్టుట సాధ్యమా
Verse
నరుడని ఎంచి హేళన చేసిరి
శక్తిని ప్రశ్నించి నిను శంకించిరి
సవాలు విసిరి అవమానించిరి
ఛీత్కరించి వెకిలిగ నవ్విరి
సామర్థ్యము కలిగీ సహియించుట సాధ్యమా
Verse
అలసిన నిన్ను బహు విసిగించినా
ఓటమి పాలై నిరాశ పరచినా
ఫలములు లేని తీగెగా మిగిలినా
మరలా మరలా నిను సిలువేసినా
వేధించిన కొలది ప్రేమించుట సాధ్యమా

Related Tags

SacrificeJesusLoveForgiveness