Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mokaalla Anubhavamu Neeku Unnadaa

మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా

Mokaalla Anubhavamu Neeku Unnadaa

Verse
మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా
విసుగక ప్రార్ధించే మనసు ఉన్నదా‖ 2x ‖
వెలిగే దీపానికి నూనె అవసరం
నీ ఆత్మా దీపానికి ప్రార్ధనవసరం‖ 2x ‖
నూనె లేని దీపము ఆరిపోవును
ప్రార్ధించలేని జీవితము పతనమవ్వును‖ 2x మోకాళ్ళ ‖
Verse
శోధనలో పడకుండా ప్రార్ధించుము
శోధన తప్పించుటకు ప్రార్ధించుము‖ 2x ‖
కన్నీటితో ప్రార్ధించిన హిజ్కియాను చూడుము
మరణము తప్పించబడి ఆయుష్షు నొందెను‖ 2x మోకాళ్ళ ‖
Verse
ప్రతి నిమిషమందు మనము ప్రార్ధించగలిగినా
పరలోక సంతోషం దేవుడిచ్చును‖ 2x ‖
పట్టుదలతో ప్రార్ధించిన ఏలీయాను చూడుము
ఆకాశ జలములను మూసివేసెను‖ 2x మోకాళ్ళ ‖
Verse
అడుగుడి మీకివ్వబడును తట్టుడి మీకు తీయబడును
అన్నాడు మన యేసు అడిగి చూడుము‖ 2x ‖
సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు
అడిగిన వారందరికి తప్పక దయచేయును‖ 2x మోకాళ్ళ ‖

Related Tags

PrayerDevotionSpiritual Life