Verse
మూడునాళ్ళ ముచ్చట కోసం
ఈ మనిషి పడే తపన చూడరా‖ 2x ‖
నీటిబుడగలాంటి జీవితం
ఏ నాడు సమసిపోవునో ఎరుగం‖ 2x ‖
Verse
మనిషికి తన మనసే చేరసాలరా
మమతలు మమకారాలే బంధాలురా‖ 2x ‖
వల్లకాటి వరకేరా భవబంధాలు
అవి కళ్లానికి చేరవురా అనుబంధాలు‖ 2x ‖
కల్లలైన కళలు మానుకో
ఎల్లవేళలా ప్రభువని వేడుకో‖ 2x మూడునాళ్ళ ‖
Verse
ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము
అది కనిపించీ మాయమయే రంగులవలయం‖ 2x ‖
గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం
అది పాపానికి జీతమురా మనిషికి మరణం‖ 2x ‖
నిత్యమైన సుఖము వెదకరా
నిరతము ఆ ప్రభుని వేడరా‖ 2x మూడునాళ్ళ ‖
Verse
తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు
అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా‖ 2x ‖
జిగటగల ఊభినుండి పైకి లేపి
నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు‖ 2x ‖
తీర్పు తీర్చబడకమునుపే
తప్పక ఆ ప్రభుని కోరరా‖ 2x మూడునాళ్ళ ‖