Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mosithivaa Naa Korakai

మోసితివా నా కొరకై

Mosithivaa Naa Korakai

Lyricist: Joy Kelvin
Verse
మోసితివా నా కొరకై సిలువ వేదనను
గొల్గొతా నీవు క్రీస్తుకై నిలచితి వేదనలో
సిలువలో రక్తము పాపికి రక్షణ విలువగు మోక్షమును
పాప క్షమాపణ పాపికి ముక్తి పరమ ప్రభుని గనుము‖ మోసితివా ‖
Verse
అమ్మా ఇదిగో నీ సుతుడు వ్రేళాడుచు పిలిచెన్
ఏలీ ఏలీ లామా సబక్తానీ చే విడిచి
దాహము తీర్చను చేదు చిరకను అందించిరిగా
ముండ్ల మకుట నీ శిరముపై గృచ్చిరి యూదుల రాజని
హేళన చేసిరి గుద్దిరి ఉమిసిరి కొరడా దెబ్బలతో
దేవ నా దేవా ఏల నా చేయి విడనాడితివిలలో‖ మోసితివా ‖
Verse
తర తరాల ఈ లోకం – యుగయుగాల నీ నామం
తరగని వేదన నీకు సిలువ విజయమునకే
కల్వరి ధారా నాథా పాపికి ప్రాణ ప్రదాత
విలువగు రక్త ప్రదాత ఆశ్రిత రక్షణ రాజా
చిందిన రక్తము విలువగు ప్రాణము లోక విమోచనకే
అందదు ఊహకు అంతము ఎప్పుడో సిద్ధపరచు ప్రభువా‖ మోసితివా ‖

Related Tags

SalvationGood FridaySacrificeCrucifixion