Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Moyaleni Bhaaramantha

మోయలేని భారమంత

Moyaleni Bhaaramantha

Lyricist: Sayaram Gattu
Verse
మోయలేని భారమంత సిలువలో మోసావు
నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు‖ 2x ‖
అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు
మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు
నాదు గతిని మార్చావు‖ 2x ‖
Verse
కడలి పై నడిచిన పాదాలు
సిలువ బరువుకు తడబడి పోయే
స్వస్థతలు చూపిన హస్తములు
సిలువలో శీలలతో వ్రేళాడే‖ 2x ‖
ఇంత ఘోరము మోపిన నేరము
నేను చేసిన పాప భారము‖ 2x మోయలేని ‖
Verse
జయము నీకని పలికిన జనము
మహిమ ఏదని నిను నిలదీసిరి
పాపములు క్షమియించిన నిన్ను
పాపివని పలుమారులు తెలిపిరి‖ 2x ‖
తాకినంతనే మహిమ నొసగిన
నీదు వస్త్రము చీట్ల పరము‖ 2x మోయలేని ‖
Verse
దైవ సుతుడవు అయినా గాని
దొంగలతో దోషిగా నిను చేర్చిరి
మధుర వాక్యము నేర్పిన నోటికి
చేదు చిరకతో దాహము తీర్చిరి‖ 2x ‖
ఇంత జరిగిన ఎంత కరుణ
వదలవేమయ నీ క్షమాపణ‖ 2x మోయలేని ‖

Related Tags

SalvationCrossGood FridaySacrifice