Chorus
ముద్దులోలికే చిన్ని నోటితో – మృదువైన పెదవులతో
అబద్దాలు చెప్పొద్దు – నిజమే చెప్పాలి
Verse
అబద్ధమాడిన గెహజి – కుష్టరోగి ఐనాడు
అననీయ సప్పిర చచ్చిపోయారు
అబద్దాలు నేర్పేవాడు మన విరోధి సాతానె
అబద్ధమాడిన వారు అగ్నిగుండములో పడతారు‖ ముద్దు ‖
Verse
సత్యమంటే యేసయ్యే – సత్యసాక్షి ఐయ్యాడు
సత్యమునే చెప్పాడు – సిలువపై మరణించాడు
ప్రాణం పోతున్నా గాని – నిజమే చెప్పాలి
దేవుని మెప్పుని కోరాలి – జీవ కిరీటం పొందాలి‖ ముద్దు ‖