Chorus
ముక్తిఁ గనరే మీ మనంబుల శక్తిగల రక్షకుని పలుకులు ముక్తిసాధన
ములకు మూలము భక్తిగొని యానంద మొందరే‖ ముక్తి ‖
Verse
పాపభారము క్రింద శ్రమపడు పాపులారా రండు నేనే ప్రాపు నెమ్మది
మీకిడుదునని పరమరక్షకుఁ డాన తిచ్చెను‖ ముక్తి ‖
Verse
ఇచ్ఛయించెడు వాఁడు యిచటికి వచ్చి జీవజలంబు రుచిగా పుచ్చు
కొనుగా కనుచుఁ బల్కెను సచ్ఛరితుఁడు మనుష్య పుత్రుఁడు‖ ముక్తి ‖
Verse
ఆకసమునందుండి యిటు దిగి లోకమునకుఁ జీవము నొసఁగునది
ఈ కడనె యున్న దది నేనను యేసు ప్రభు వాక్కు మధురాన్నము‖ ముక్తి ‖
Verse
నేనె మార్గము నేనె సత్యము నేనె జీవము నావలననే గాని యెపఁడును
తండ్రి యొద్దికి రానలవిగాదని వచించెను‖ ముక్తి ‖
Verse
జీవజలము నుద్రావుటకు మీ భావన లనెడి పాత్ర ముంచుచు చేవఁ
గొని పానించుచు నిరత జీవమును వెలుఃగొంది బ్రతుకను‖ ముక్తి ‖
Verse
ఎక్కడను యిటువంటి ప్రభువును మక్కువను వేసారి వెతకిన చిక్క(బో
డిటువచ్చి జూడుడి గ్రక్కునను జేసట్టు డిప్పుడే‖ ముక్తి ‖