Verse
ముందు కందరును జేరను
ఎందు బోయినన్ గాపాడి
తొందరల్మ ఱేమ్మిరాక
బంధుఁడేసు నిన్ను గావుతన్
యేసుని సన్నిధి‖ యేసుని సన్నిధి ‖
నేకమైగూడుదాఁక
దాసుని ధీరతన్
దైవపిత నిన్ను గావుతన్
Verse
ఱెక్క నీడ నిన్నుఁ జేర్చుచు
మిక్కుటంపు ప్రేమఁజూపిఁ
చిక్కులాప తిల్లకుండ
మక్కువన్ ప్రభుండుగావుతన్
Verse
నాఁడు నాడాహారమిచ్చుచు
వేడుకన్ గౌగిటఁ జేర్చి
కీడులందు నిన్ను గాంచి
ఱేడునిన్నుఁ బ్రోచికావుతన్
Verse
చావు యొక్క భీతిలేకను
జీవమార్గమందుఁ దోడై
రేవుఁజేరుఁదాక బ్రోచి
పావనుండు నిన్ను గావునన్