Chorus
నా ఆశ నీతో ఉండాలని
నా ఆశ నీలా ఉండాలని
నా ఆశ నీతో నిలవాలని
నా ఆశ నిన్ను చూడాలని
ఏ . . ఓ . . ఏ . . ఓ . .
Verse
నీతోనే స్నేహం చేయాలని
నాలో ఎంతో ఆశ ఉన్నది
నీ ప్రేమ కౌగిలిలో ఉండాలని
నాలో ఎంతో ఆశ ఉన్నది‖ 2x ‖
నా శిక్షను నీవు పొందావులే
నా కొరకు ప్రాణం పెట్టావులే
నీ ప్రేమతో నను నింపావులే
నిజమైన స్నేహం నీదే
Verse
నీలాంటి స్నేహితుడు ఉన్నాడని
నిను గూర్చి అందరికి చెప్పాలని
నీ పనిలో నిత్యం సాగాలని
నీ కొరకు సాక్షిగా ఉండాలని‖ 2x ‖
నీ ఆత్మతో నను నింపుము నీ వరము
నాకు దయచేయుము
నీ పాత్రగా నను వాడుకో
నీ సాక్షిగా నింపుము