Verse
నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం
ఈలోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు
Verse
ఈ లోకనటన ఆశలన్నియు తరిగి పోవుచుండగా
మారని నీ వాగ్ధానములన్నియు నే నమ్మిసాగెదను
Verse
పలువిధ శోధన, కష్టములు ఆవరించు చుండగా
కలత చెందుచున్న నా హృదయమును కదలకకాపాడుము
Verse
నీసన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు
నీదు కుడి హస్తములో నిత్యమున్న నాకు సుఖక్షేమమేగా