Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Na Neethi Neeve Na Khyaathi Neeve Na Daivama

నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా

Na Neethi Neeve Na Khyaathi Neeve Na Daivama

Verse
నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా
నా క్రియలు కాదు నీ కృపయే దేవా నా ప్రాణమా యేసయ్యా
నదులంత తైలం, విస్తార బలులు నీ కిచ్చినా చాలవయ్యా
నీ జీవితాన్నే నాకిచ్చినావు నీకే నా జీవమయ్యా
హలెలూయా. . ఆమేన్‌ హలెలూయా
హలెలూయా. . ఆమేన్‌ హలెలూయా
Verse
నాధీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా
నా దోష శిక్ష భరియించినీవు నను నీలో దాచావుగా
ఏమంత ప్రేమ నా మీద నీకు నీ ప్రాణమిచ్చావుగా
నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను యజమానుడవు నీవేగా
Verse
నా ప్రియులే నన్ను వెలివేసి నప్పుడు నీవు చేరదీసావుగా
నా ప్రక్కనిలచి నను దైర్యపరచి కన్నీరు తుడిచావుగా
నేనున్న నీకు భయమేలనంటు ఓదార్పునిచ్చావుగా
చాలయ్యా దేవా నీక్రుపయే నాకు బ్రతుకంతయు పండుగా
Verse
ఆ ఊభిలోన నే చిక్కి నప్పుడు నీవు నన్ను చూసావుగా
నీ చేయి చాపి నను పైకి లేపి నీవాక్కు నిచ్చావుగా
నా సంకటములు నా ఋణపు గిరులు అన్నిటిని తీర్చావుగా
నీలోన నాకు నవజీవమిచ్చి నీ సాక్షిగా నిలిపావుగా

Related Tags

WorshipGraceSalvation