Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Na Praanamaa Dhigulendhuku Nee Rakshakuni Smariyinchuko

నా ప్రాణమా దిగులెందుకు నీ రక్షకుని స్మరియించుకో

Na Praanamaa Dhigulendhuku Nee Rakshakuni Smariyinchuko

Lyricist: Joel Kodali
Verse
నా ప్రాణమా దిగులెందుకు - నీ రక్షకుని స్మరియించుకో
మహిమోన్నతుడు బలవంతుడు - నీ పక్షమునే నిలిచెనుచూడు
Verse
లెవరా వీరుడా నిరాశను వీడరా నీ రాజు నిన్ను పిలిచెను
కదులు ముందుకు కదులు ముందుకు
అసాధ్యుడే నీకుండగా అసాధ్యము నీకుండునా
భయము వీడి నడవరా జయమునీదే జయమునీదే
౹౹నా ప్రాణమా‖ Na Praanamaa ‖
Verse
యేసులో విశ్వాసమే నీ చేతిలోని ఆయుధం
విడువకుండ పట్టుకో ఎన్ని శ్రమలు నీకు కలిగినా
లేమిలో కొలిమిలో ఒంటరివి కావు ఎన్నడూ
యేసు నీతో ఉండును నీ సహాయమాయనే
నీవు వెంబడించువాడు నీవు నమ్మదగిన దేవుడు
నీ శ్రమలు దూరపరచును నిన్ను గొప్పగా హెచ్చించును‖ 2x ‖
Verse
|| నా ప్రాణమా‖ నా ప్రాణమా ‖
Verse
గర్జించు సింహమువలె సాతాను వెంటపడినను
ఎదురుతిరిగి నిలబడు వాడు నిలువలేకపోవును
జయించెనేసు ఏన్నడో సాతాను ఓడిపోయెను
నీ ఎదుటనున్న శత్రువు ప్రభావము శూన్యమే
నీలోన ఉన్నవాడు లోకములనేలువాడు
నిర్భయముగా సాగిపో నీన్ను ఆపలేరు ఎవ్వరు‖ 2x ‖
Verse
|| నా ప్రాణమా‖ నా ప్రాణమా ‖
Verse
నీవు ఎక్కలేని కొండను ఎక్కించును నీ దేవుడు
నీవు చేరలేని ఎత్తుకు నిన్ను మోయునాయనే
నీ ప్రయాస కాదు వ్యర్థము యేసు గొప్ప ఫలము దాచెను
తన తండ్రి ఇంట నీకును సిద్ధపరిచెను నివాసము
ఊహించలేని మహిమతో ప్రభువు నిన్ను నింపివేయును
ఆశ్చర్యమైన స్వాస్థ్యము నీ చేతికప్పగించును‖ 2x ౹౹నా ప్రాణమా ‖

Related Tags

FaithEncouragementTrust