Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Na Prananiki Pranam Nive Yesayya

నా ప్రాణానికి ప్రాణం నీవే యేసయ్యా

Na Prananiki Pranam Nive Yesayya

Chorus
నా ప్రాణానికి ప్రాణం నీవే యేసయ్యా. . .
స్నేహానికి నిజ స్నేహం నీవే మెసయ్యా. . .
Chorus
నా ప్రాణానికి ప్రాణాం నీవేనయ్యా
స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా
నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా
Verse
ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు
కన్నీటి సమయములో ఒంటరిని చేసారు‖ 2x ‖
ఆస్తులున్న వేళ్ళలో అక్కున చేరారు
ఆపద సమయాలలో అంతులేక పోయారు
జంటగ నిలచితివి నా ప్రాణమా కన్నీరు తుడిచితివి
నా స్నేహమా కన్నీరు తుడిచితివి‖ 2x ‖
Verse
నీవే నా ప్రాణమని కడవరకు విడువ నని
బాసలన్ని మరచి అనాధగ నన్ను చేసారు‖ 2x ‖
నేనున్నానంటు నా చెంతన చేరావు
ఎవరు విడచిన నను విడువనన్నావు
జంటగ నిలచితివి నా ప్రాణమా కన్నీరు తుడిచితివి
నా స్నేహమా కన్నీరు తుడిచితివి‖ 2x ‖

Related Tags

WorshipDevotionalJesus