Verse
నా యేసుని సన్నిధిలోనే నా జీవితం అర్పించెదను
కాలము మారినా కష్టాలు కలిగినా
విడువక నేను సాగి పొదును
Verse
నీ తండ్రి నేనని నీతోడు ఉంటానని
పలికిన యేసు పలుకులు వినగా
పగిలెను హ్రదయం తొలగేను భారం
కలిగెను ఆనందం దొరికెను ఆశ్రయం
Verse
హల్లెలుయా పాట పాడి క్రిస్తు కొరకు మాటలాడి
ఆ మహిమ ప్రభావంతో ఆ యేసు చెంతచేరి
జీవించెదనేను ఆ యేసు వారసునిగా
అదే నాకు భాగ్యము అదే నాకు శ్రేష్ఠము