Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Aashala Pallaki

నా ఆశల పల్లకి

Naa Aashala Pallaki

Lyricist: J P Ramesh
Verse
నా ఆశల పల్లకి నీవే
నా ఊహల ఊట నీవే
నాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా ఆశ నీవయ్యా‖ 2x ‖
Verse
ఎడారిలో నీటి కొరకు – ఆశపడు బాటసారిలా
నీ కొరకు నా ప్రాణం – ఆశపడుచున్నది‖ 2x ‖
నా ఆశ నీవైపే – నా ధ్యాస నీవైపే
దాహము తీర్చావని‖ 2x యేసయ్యా ‖
Verse
దిక్కులేని పక్షిగా నేను – నిరాశతో ఉండగా
నా ఆశ తీర్చావే – నీ దరి చేర్చావే‖ 2x ‖
నా గమ్యం నీవైపే – నా గానం నీ కొరకే
తోడుగ ఉన్నావని‖ 2x యేసయ్యా ‖
Verse
స్నేహితులు లేరని – తోడెవరు రారని
నా మనసు నాలోన – దుఃఖించు సమయాన‖ 2x ‖
నా స్నేహం నీవయ్యావు – దుఃఖము తీర్చావు
ఆదరించావయ్యా‖ 2x యేసయ్యా ‖

Related Tags

PraiseWorshipHope