Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Baagaswamini

నా భాగస్వామిని

Naa Baagaswamini

Lyricist: Joshi Ennam James & Prathima Ennam
Verse
Yeshua
Yeshua
Yeshua…a..a..a..
Yeshua….
Verse
నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు
దేవా నా జీవితమంతా ఏకమై నడిచెదను
నా ప్రియునితో నన్ను జతపరిచియున్నారు
దేవా నా జీవితమంంతా ఏకమైయుండెదను
నాయందు నీ వివాహకార్యమును
విశ్వాసముతో స్వీకరించెదన్
Verse
పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను
పరమాత్మునికార్యముగా ఈ యాత్రను కొనసాగింతును‖ Yeshua ‖
Verse
వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని
నా తల్లితండ్రిని విడిచి
నిన్ను హత్తుకొందును
క్రీస్తు యేసు సంఘమునకు
శిరస్సై యుండులాగున
నేను నా భార్యకు శిరస్సుగ ఉందును
నా ప్రియసఖివే నాలో సగభాగమై
యేసును వెంబడించు సహవాసివై
అంతము వరకు నీకు తోడై యుండి
క్రీస్తుని నీడలో ఫలియించెదము‖ పరలోక ‖
Verse
వివాహము అన్నిటికన్న ఘనమైనది అని
నేను నా స్వజనము మరచి
నిన్ను హత్తుకొందును
సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా
నేను నా భర్తకు లోబడియుండెదను
నను ప్రేమించి నను ధైర్యపరచి
కలువరి ప్రేమే మూల స్థంభమై
క్రీస్తు ప్రణాళికలో నీకు సహకారినై
పరిశుద్ధ గృహమును
నేను నిర్మించెదను‖ పరలోక ‖
Verse
నేను ఇది మొదలుకుని
చావు మనలను ఎడబాపు వరకు
దేవుని పరిశుద్ధ నీ దయను చూపున
మేలుకైనను కీడుకైనను
కలిమికైనను లేమికైనను
వ్యాధియందును ఆరోగ్యమందును
నిను ప్రేమించి సంరక్షించుటకై
నా భార్యగా చేసుకొనుచున్నాను
నీ చొప్పున జరిగింతునని
ప్రమాణము చేయుచున్నాను
నా భర్తగా చేసుకొనుచున్నాను
నీ చొప్పున జరిగింతునని
ప్రమాణము చేయుచున్నాను…

Related Tags

MarriageWeddingCovenant