Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Brathuku Dinamulu

నా బ్రతుకు దినములు

Naa Brathuku Dinamulu

Lyricist: Joel Kodali
Verse
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము
ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము‖ నా బ్రతుకు ‖
Verse
ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని
ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని
ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని
నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
మరల నన్ను నూతనముగ చిగురు వేయని‖ నా బ్రతుకు ‖
Verse
నీ పిలుపు నేను మరచితి – నా పరుగులో నేనలసితి
నా స్వార్ధము నా పాపము – పతన స్థితికి చేర్చెను
నా అంతమెటుల నుండునో – భయము పుట్టుచున్నది
దేవా నన్ను మన్నించుము – నా బ్రతుకు మార్చుము
యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును
విశేషముగా రూపించుము నా శేష జీవితం‖ నా బ్రతుకు ‖

Related Tags

PrayerRepentanceLife Reflection