Verse
నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని
నే ఆరాధించేదన్
పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి
బాగు చేయమని కోరెదన్
హోసన్న… హోసన్న… యుదుల రాజుకే
హోసన్న… హోసన్న… రానున్న రారాజుకే
మట్టి నుండి తీయబడితివి
మరల మట్టికే చేరుదును
మన్నైన నేను మహిమగా మారుటకు
నీ మహిమను విడచితివే
అడుగులు తడబడిన వెళ్ళలో
నీ కృపతో సరిచేసితివే
నా అడుగులు స్థిరపరచి
నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే
ఈ లోక యాత్రలో
నాకున్న ఆశంతయు
నా తుది శ్వాస.. విడిచే వరకు
నీ పేరే ప్రకటించాలని