Verse
నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ
నిను చాటనీ – నిను ఘనపరచనీ
నీ రాకకై వేచియుండనీ‖ నా చిన్ని ‖
Verse
కావలివారూ వేకువకై చూచునట్లు
నా ప్రాణము నీకై యెదురు చూడనీ‖ 2x ‖
నా ప్రాణము నీకై యెదురు చూడనీ‖ నా చిన్ని ‖
Verse
దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగా
నా ప్రాణము నిన్నే ఆశింపనీ‖ 2x ‖
నా ప్రాణము నిన్నే ఆశింపనీ‖ నా చిన్ని ‖
Verse
పనివారు యజమాని చేతివైపు చూచునట్లు
నా కన్నులు నీపైనే నిలచియుండనీ‖ 2x ‖
నా కన్నులు నీపైనే నిలచియుండనీ‖ నా చిన్ని ‖