Verse
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా విచారములు కొట్టివేసి
ఆనందము కలుగజేసితివి
Verse
నా హృదయములో నదివలె సమాధానమే
నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే
Verse
తగిన సమయములో హెచ్చించునట్లు
నను దాచి కాచితివి
దీనమనసు కలిగి జీవింప నీ కృప నిచ్చితివి
నా చింతలన్ని బాపి నీ శాంతితో నింపితివి
ఆపత్కాలములో పర్ణశాలలో
నను నీవు దాచితివి
నా సహాయకుడ నీవని నే నాట్యమాడి కీర్తింతును
నా జీవితకాలమంతయు నీ సన్నిధిని నివసింతును
అగ్ని శోధనలు నను చుట్టుకొనగా
దాచితివి నీ కౌగిలిలో
స్నేహబంధముతో బంధించి నను ప్రేమించితివి
జేష్టుల సంఘముకై నను సిద్ధపరచితివి