Verse
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
సుడిగాలిలోనైనా జడి వానలోనైనా
ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము‖ 2x ‖
Verse
ఆరని దీపమై దేదీప్యమానమై
నా హృదయ కోవెలపై దీపాల తోరణమై‖ 2x ‖
చేసావు పండుగ వెలిగావు నిండుగా‖ 2x నా దీపము ‖
Verse
మారని నీ కృప నను వీడనన్నది
మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది‖ 2x ‖
మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా‖ 2x నా దీపము ‖
Verse
ఆగని హోరులో ఆరిన నేలపై
నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై‖ 2x ‖
పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా‖ 2x నా దీపము ‖