Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Deva Prabhuvaa Nee Chenthanu Sadaa

నా దేవ ప్రభువా నీ చెంతను సదా

Naa Deva Prabhuvaa Nee Chenthanu Sadaa

Lyricist: Sarah Flower Adams
Verse
నా దేవ ప్రభువా
నీ చెంతను
సదా వసింపను
నా కిష్టము
ఏవైన శ్రమలు
తటస్థమైనను
నీ చెంత నుందును
నా ప్రభువా
Verse
ప్రయాణకుండను
నడవిలో
నా త్రోవఁ జీఁకటి
కమ్మినను
నిద్రించుచుండఁగా
స్వప్నంబునందున
నీ చెంతనుందును
నా ప్రభువా.
Verse
యాకోబు రీతిగా
ఆ మెట్లను
స్వర్గంబుఁ జేరనుఁ
జూడనిమ్ము.
నీ దివ్య రూపము
ప్రోత్సాహపర్చఁగా
నీ చెంతనుందును
నా ప్రభువా.
Verse
నేనిద్రలేవఁగా
నా తండ్రి, నే
నీకుం గృతజ్ఞతఁ
జెల్లింతును.
నే చావునొందఁగా
ఇదే నా కోరిక
నీ చెంతనుందును
నా ప్రభువా.

Related Tags

WorshipDevotionalPrayer