Chorus
నా దేవుడు గొప్పవాడు - ఏదైనా చెయ్యగలడు
ప్రభువెపుడు ఓడిపోడు – ఓడి పోడు, ఓడిపోడు
సరియైన సమయమందే - రంగంలో దూకుతాడు
ముందు రాడు - ఆలస్యమవ్వడు - ముందు రాడు, ఆలస్యమవ్వడు
Verse
భవిష్యత్ ఏమౌతుందోనన్న భయము లేదు నాకు!
రేపు ఏ మలుపు ఉందోనన్న చింత లేదు నాకు!
అరె! నా జీవితం - ప్రభుని చేతిలో -‖ 2x ‖
ఉంచి నేను నిశ్చింతగా ఉన్నా !
Verse
నేనేమి అవ్వవలెనో - ఖచ్చితంగా తెలిసినోడు - ముందే నిర్ణయించినాడు!
నన్నేమి చెయ్యవలెనో - ప్రభు చేసి తీరుతాడు - ఆపేటివాడు ఎవడు?
నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే
నను గూర్చి తనదు గ్రంధములో వ్రాసి ఉంచినాడు.
Verse
నా పాపంకొరకు ప్రభువు-జగతికి ఉత్పత్తి మొదలు-వధియింపబడియున్నాడు
ఏదైనా సమస్య నాపై - దండెత్తి రాక మునుపే - పరిష్కారం సిద్ధపరుస్తాడు.
నా మేలు కొరకు అన్నియును సమకూర్చి జరుపు ప్రభువు
నా పక్షమందు కార్యమును సఫలపరచుతాడు.
Verse
నాకేమి అవసరములో - నేనింకా అడగనపుడే - నా తండ్రికి ముందే తెలుసు.
నాకింక ఏమి కొదువ? - క్రీస్తేసు మహిమ వలన - సర్వ సమృద్ధి కలదు.
తన సొంత కొడుకునే నా కొరకు యిచ్చేసినాడు తండ్రి
ఆయనతో పాటు అన్నియును యిచ్చి తీరుతాడు
Verse
మన దేవుని వాగ్దానములు- అన్నియును క్రీస్తునందు- అవును ఆమేన్ నాకు!
వాగ్దానం చేసినోడు - ఎప్పుడూ నమ్మదగినవాడు - నాకసలు దిగులు లేదు.
ఈ భూమి కంటె ఆకాశములు ఎంతెత్తుగా ఉన్నాయో
నా కొరకు ప్రభుని ఉద్దేశ్యములు - అంత ఉన్నతములు!
Verse
తొట్రిల్లకుండ నన్ను - కాపాడగలిగినోడు - శక్తి గల రక్షకుండు.
తన మహిమ యెదుట నన్ను - నిర్దోషిగా నిలువబెట్టి - ఆనందిస్తున్నవాడు.
తన ఆత్మ చేత ముద్రించెను నను, నా ప్రభువు వచ్చువరకు
నను తండ్రి చేతిలోనుండెవడు అపహరింపలేడు!