Verse
నా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో‖ 2x ‖
ఎంతో సంతోషం – ఎంతో ఆనందం‖ 2x ‖
నా యేసుని నివాసములో‖ 2x నా దేవుని ‖
Verse
సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదా
రాత్రి జాముల యందు- నా తోడు నీడవు నీవే కదా‖ 2x ‖
నా కొండ నీవేగా – నా కోట నీవేగా‖ 2x ‖
నా యేసు రక్షకా నీవే కదా‖ 2x నా దేవుని ‖
Verse
నా యేసు సన్నిధి యందు – నేను పరవశమొందెదను
నా యేసు స్వరమును వినుచు – నేను కాలము మరచెదను‖ 2x ‖
నా గానమాయెనే – నా ధ్యానమాయెనే‖ 2x ‖
నాదు స్వరము నా ప్రభువే‖ 2x నా దేవుని ‖
Verse
ఆనంద తైలము నందు – నన్ను అభిషేకించెనుగా
నాదు వస్త్రము నందు – అగరు వాసన నింపెనుగా‖ 2x ‖
నా ప్రాణ నాథుడా – నా ప్రేమ పాత్రుడా‖ 2x ‖
నా యేసు నాథుడా నీవే కదా‖ 2x నా దేవుని ‖